
రవితేజ ఇప్పటివరకు లిప్ టు లిప్ కిస్ సీన్లు చెయ్యలేదు. ఇన్నేళ్ల కెరీర్ లో వాటికి దూరంగా ఉన్నాడనే చెప్పాలి. ఇడియట్ వంటి సినిమాల్లో అలా అనిపించే రొమాంటిక్ మూమెంట్స్ చేసినా… డైరెక్ట్ గా హీరోయిన్ పెదవులతో తన పెదవులను కలపలేదు. కానీ ఇప్పుడు 50 ప్లస్ ఏజ్ లో ట్రెండ్ కి తగ్గట్లుగా కిస్ సీన్లలోకి దిగాడు.
ఈ రోజు విడుదలైన “ఖిలాడి” ట్రైలర్ లోనే ఈ కిస్ సీన్ ని యాడ్ చేశారు. హీరోయిన్ మీనాక్షి దీక్షిత్ తో రవితేజ ఈ సీన్ చేసినట్లు కనిపిస్తోంది.
రవితేజ కొత్త జనరేషన్ ని కనెక్ట్ కావాలనే ఉద్దేశంతోనే గ్లామర్ మీద ఫోకస్ పెట్టాడట. తన సినిమాల్లో యంగ్ హీరోయిన్లతో నటిస్తున్నాడు. అలాగే, ఇప్పుడు ముద్దు సీను. ఐతే, ఇది సినిమాలో ఫుల్ లెంగ్త్ లో ఉంటుందా? ట్రైలర్ లో ఉన్నట్లు కన్ను మూసి తెరిచే లోపే మాయమవుతుందా? అన్నది చూడాలి.
మీనాక్షి చౌదరికిది రెండో చిత్రం. ఇంతకుముందు ఈ భామ సుశాంత్ సరసన ‘ఇచట వాహనములు నిలుపరాదు’లో నటించింది. కానీ అది ఆడలేదు. ఇది విజయం సాధిస్తే ఆమెకి బ్రేక్ వస్తుంది. ఈ కిస్సులు, ఈ గ్లామర్ సీన్లతో ఆమె కుర్రకారును ఆకట్టుకునే ఛాన్స్ ఉంది.