సల్మాన్ డబ్బు ఎందుకు తీసుకోలేదు?

Salman Khan


సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో పెద్ద హీరో. ఆయన పారితోషికం 100 కోట్లు ఉంటుంది. అలాంటి హీరో ఒక తెలుగు సినిమాలో అతిథి పాత్ర పోషించడమే వెరైటీ. అది కూడా డబ్బులు తీసుకోకుండా గెస్ట్ రోల్ చేశారట.

చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక చిన్న పాత్ర పోషించారు. ఈ సినిమాలో గెస్ట్ గా నటించేందుకు ఆయన స్థాయికి తగ్గట్లు కొంత పారితోషికం ఇద్దామని నిర్మాతలు భావించారట. కానీ, ఆ ప్రతిపాదనతో ముందుకొచ్చిన నిర్మాతలను సల్మాన్ ఖాన్ గెట్ అవుట్ అని గెంటేసినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇవి పుకార్లు కాదు నిజమేనట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కన్ ఫమ్ చేశారు.

సల్మాన్ ఖాన్, చిరంజీవి కుటుంబాల మధ్య అనుబంధం చాలా కాలంగా ఉంది. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ మధ్య స్నేహం ఉంది. అందుకే, సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఆ పాత్ర చేశాడు. కథ నచ్చిందనో, పాత్ర నచ్చిందనో ఈ సినిమా చెయ్యలేదు సల్మాన్ ఖాన్. పారితోషికం కోసం కూడా ఒప్పుకోలేదు. కేవలం చిరంజీవి మీద ఉన్న గౌరవంతో సల్మాన్ ఈ సినిమాలో నటించారు. అందుకే, ఫ్రీగా ఈ సినిమా చేశారు.

Salman Khan and Chiranjeevi

ఇంతకుముందు ‘సైరా’ సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా నటించారు. చిరంజీవితో బాలీవుడ్ పెద్ద హీరోలకు ఆ అనుబంధం ఉంది. అమీర్ ఖాన్ కూడా చిరంజీవి బాగా సన్నిహతులు.

 

More

Related Stories