వాళ్ళని అంకుల్ అని అనరెందుకు?

తనని ఆంటీ అని పిలిచిన నెటిజెన్లపై అనసూయ ఒక రేంజ్ లో ఫైర్ అయింది. ఆమె విసుగెత్తి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మానేసింది. ఐతే, ఇప్పుడు మరో నటి “ఆంటీ” అనే పిలుపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆమె ఎవరో కాదు కస్తూరి.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నటి.. కస్తూరి. ఆమెని కూడా కుర్రాళ్ళు ఆంటీ అని సోషల్ మీడియాలో సంబోధిస్తున్నారు. ఈ విషయంలో ఆమె కూడా ఫీల్ అవుతోంది. చిన్న పిల్లలు ‘ఆంటీ’ అని పిలిస్తే ఓకే కానీ పెద్దవాళ్ళు కూడా ఇలా పిలవడం తప్పు అని ఆమె చెప్తోంది.

మమ్మల్ని ఆంటీ అని పిలిచే మగవాళ్ళు మరి హీరోలను అంకుల్ అని ఎందుకు అని పిలవరు? హీరోలను సార్ అని సంబోధిస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం ఆంటీ అని వేధిస్తారు ఎందుకు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

కస్తూరి అనేక విషయాల గురించి బోల్డ్ గా మాట్లాడుతుంది. రాజకీయాలు, స్త్రీల హక్కులు, సెక్స్…. ఇలా అన్నింటి గురించి సోషల్ మీడియాలో చర్చిస్తుంది. అందుకే, ఆమె ఇప్పుడు ‘ఆంటీ’ అనే పిలుపు గురించి వాదిస్తోంది. ఒకప్పుడు అనసూయ ఇలాగే వాదించింది. ఇప్పుడు కస్తూరి వంతు.

ఇదీ చదవండి: దిల్ ‌రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా.. పెద్ద ప్లానే ఉందిగా..!

Advertisement
 

More

Related Stories