
ఉన్నట్టుండి “హరిహర వీరమల్లు” సినిమాకి సంబంధించి ఒక ప్రకటన వెలువడింది. ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయి పది నెలలు కావొస్తోంది. జనం అందరూ మరిచిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి కూడా ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఆయన అభిమానులు కూడా ఈసారి జనసేనాని రాజకీయనాయకుడిగా తన సత్తా చూపుతారని బలంగా నమ్ముతున్నారు.
ఇలాంటి టైంలో “హరి హర వీరమల్లు” సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే ఒక కొత్త ప్రోమో వస్తుందని నిర్మాత ప్రకటించారు. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి.
ఈ సినిమాని పవన్ కళ్యాణ్ మొత్తానికి ఆపేశాడని మీడియాలో వార్తలు వచ్చాయి. అలాగే, ఇప్పటివరకు పెట్టిన ఖర్చు మొత్తాన్ని తాను భరిస్తాను అని, సినిమాని పక్కన పడేసి వేరే సినిమాలు నిర్మించుకోమని నిర్మాత ఏ.ఎం.రత్నంకి పవన్ కళ్యాణ్ చెప్పారని పుకార్లు పుట్టించారు.
ALSO READ: Hari Hara Veera Mallu’s producer: A promo will be out soon
ఇక మరోవైపు, ఈ సినిమా అటకెక్కింది అనే ఉద్దేశంతో దర్శకుడు క్రిష్ మళ్ళీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసుకుంటున్నాడు అని, ఆయన “హరిహర వీరమల్లు”ని మర్చిపోయాడని మరో పుకారు వచ్చింది.
ఇలా రెండు రూమర్స్ ఒకేసారి రావడంతో నిర్మాత రత్నం సడెన్ గా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.