చిట్టికి ఆఫర్లు రావట్లేదా?

Faria Abdullah

ఒక సినిమా హిట్ అయిందంటే… ఆ సినిమాలో నటించిన హీరోకి, హీరోయిన్ కి పొలోమంటూ ఆఫర్లు వస్తాయి. ‘ఉప్పెన’ సినిమాతో పరిచయమైన కృతి శెట్టి ఇప్పటికే మూడు సినిమాల్లో ఛాన్సులు కొట్టిసేంది. అలా ఉంటుంది ఒక మూవీ సక్సెస్ తెచ్చే క్రేజ్.

‘ఉప్పెన’ ఎంత పెద్ద హిట్ అయిందో ‘జాతి రత్నాలు’ అంతే పెద్ద హిట్. 4 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే 30 కోట్లు థియేటర్ల నుంచే వచ్చాయి.

మరి, ఈ సినిమా ద్వారా పరిచయమైన ఫరియా అబ్దుల్లా కొత్త సినిమా గురించి ఇంతవరకు ఒక్క స్టేట్ మెంట్ రాలేదు. ఆమెని ఫలానా సినిమాలో పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు రావట్లేదు. ఎందుకు?

ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ అమ్మాయే. చూడ్డానికి అందంగానే ఉంది. ఐతే, ఈ భామ చాలా పొడువు. అనుష్క శెట్టి కన్నా హైట్. అందుకే ఆమెకి అవకాశాలు రావట్లేదు అని కామెంట్ వినిపిస్తోంది. ఐతే, పొడువున్న చాలామంది హీరోయిన్లకు అవకాశాలు వచ్చాయి కదా! మరి సమస్య ఏంటో?

త్వరలోనే ‘జాతిరత్నాలు’ సీక్వెల్ తెరకెక్కనుంది. అందులో మాత్రం ఈ ‘చిట్టి’ మళ్ళీ కుర్రాళ్ళ గుండెకి చిల్లు వెయ్యనుంది.

More

Related Stories