హైపర్ ఆది ఎందుకు క్లిక్ అవలేదు?

Hyper Aadi

హైపర్ ఆది.. బుల్లితెర సూపర్ స్టార్. ఇతడి కామెడీ పంచ్ లు మామూలుగా ఉండవు. జబర్దస్త్ కు ఓ కలర్ తీసుకొచ్చాడు ఈ నటుడు. ఇలాంటి కమెడియన్ కాస్తా సినిమాల్లోకి వచ్చేసరికి తేలిపోయాడు. హిట్ హాస్యనటుడు అనిపించుకోలేకపోయాడు. ఎందుకిలా జరుగుతోంది?

ఇదే ప్రశ్న హైపర్ ఆదికి ఎదురైంది. దీనికి అతడిచ్చిన సమాధానం కూడా అంతే జెన్యూన్ గా ఉంది. తను సినిమాల్లో పెద్దగా క్లిక్ అవ్వలేకపోవడానికి కారణం చెప్పుకొచ్చాడు ఆది.

“టీవీల్లో స్కిట్స్ అన్నీ నావే. పంచ్ లు నేనే వేస్తాను. మిగతా క్యారెక్టర్లను డామినేట్ చేస్తాను. కానీ సినిమా వచ్చేసరికి అలా వర్కవుట్ కాదు. నా పంచ్ లు కొన్నే ఉంటాయి. నా ట్రాక్ చాలా చిన్నదైపోతుంది,” తను సినిమాల్లో ఎందుకు క్లిక్ అవ్వలేకపోతున్నాడో చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

“అయినప్పటికీ ‘తొలిప్రేమ’, ‘మేడమీద అబ్బాయి’ లాంటి సినిమాల్లో నా ట్రాక్స్ బాగానే పండాయి,” అని కూడా అంటున్నాడు.

మరీ ముఖ్యంగా సినిమాలకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ లో తన ప్రమేయం ఉండదని, డైరక్టర్ రాసుకున్న క్యారెక్టర్ కు తన స్టయిల్ ను యాడ్ చేస్తానని చెప్పుకొచ్చాడు ఆది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాల్లో ఆదికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదు. అందుకే ఆయన పంచ్ లు పేలడం లేదు.

More

Related Stories