కృతి శెట్టిని ఎందుకు దాచారు?

రెండేళ్ల క్రితం హీరోయిన్ కృతి శెట్టి యమా క్రేజున్న హీరోయిన్. ఇప్పుడు కొంచెం హవా తగ్గింది. అలాగని ఆమెకి అవకాశాలు తగ్గలేదు. పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఒక్క హిట్ పడితే చాలు ఆమె మళ్ళీ క్రేజ్ తెచ్చుకోగలదు. ప్రస్తుతం ఆమెని ఒక నిర్మాణ సంస్థ దాచింది. అందుకే ఆమె ప్రస్తావన ఇప్పుడు.

ఇంతకీ మేటర్ ఏంటంటే…

కృతి శెట్టి శర్వానంద్ సరసన ఒక చిత్రం చేస్తోంది. షూటింగ్ కూడా జరుగుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని. నిన్న శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఒక వీడియో క్లిప్ ని విడుదల చేశారు. హీరోని హీరోయిన్ డాష్ ఇవ్వగానే ఇద్దరిలో కరెంట్ పాస్ అయ్యే ఒక రొమాంటిక్ సీన్. ఐతే, ఈ సీన్ లో శర్వానంద్ కనిపిస్తాడు కానీ కృతి శెట్టి ముఖం మనకు స్పష్టంగా కనిపించదు.

ఇదీ చదవండి: టాలీవుడ్ ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు.. పూనమ్ కౌర్ కంటతడి..!

ఆమెని ఎందుకు ఇలా దాస్తున్నారు?

కృతి శెట్టి పేరుని నిర్మాణ సంస్థ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఆమె ఫస్ట్ లుక్ ని సెపరేట్ గా విడుదల చెయ్యాలనేది ప్లాన్. అందుకే ఈ వీడియోలో ఆమె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

శర్వానంద్, కృతి శెట్టి…ఇద్దరూ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారట. పూర్తి మేకోవర్ జరిగింది ఇద్దరికీ. ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. మరోవైపు కృతి శెట్టి నాగ చైతన్య ‘కస్టడీ’ సినిమాతో ఈ వేసవి సెలవుల్లో మన ముందుకు రానుంది.

 

More

Related Stories