కరోనా టైమ్ లో పెళ్లి అందుకే!

Kajal Aggarwal

గౌతమ్ కిచ్లు… కాజల్ కు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. పైగా ఏడాదిగా డేటింగ్ కూడా చేస్తోంది. కుటుంబానికి దగ్గరైన వ్యక్తి కూడా. అలాంటప్పుడు ఈ కరోనా టైమ్ లోనే హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. సరిగ్గా ఇప్పుడు ఇదే ప్రశ్న అందర్నీ తొలిచేస్తోంది.

35 ఏళ్ల కాజల్, కావాలనుకుంటే మరో ఏడాది ఆగొచ్చు. ఎంచక్కా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం తన పెళ్లిని హడావుడిగా ప్రకటించింది, ఈ నెలాఖరుకే మూడు ముళ్లు వేయించుకోవడానికి రెడీ అయిపోయింది.

పోనీ ఖాళీగా ఉందా అంటే అది కూడా లేదు. తెలుగులో మెగాస్టార్ సరసన “ఆచార్య” చేస్తోంది. తమిళ్ లో కమల్ సరసన “ఇండియన్-2” చేస్తోంది. దీంతో పాటు “ముంబయి సాగా” లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇప్పుడే పెళ్లికి తొందరేం వచ్చింది.

ఇంత హడావుడిగా కాజల్ పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక్క కారణం ఉంది. లాక్ డౌన్ తో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇంకా పూర్తిస్థాయిలో షూటింగ్స్ స్టార్ట్ చేయలేదు. కేవలం తను చేస్తున్న సినిమాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే ఉన్నాళ్లూ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అనుకోని విధంగా ఫ్రీ టైమ్ దొరకడంతో ముందు పెళ్లి చేసుకొని, తర్వాత సినిమాలతో బిజీ అవ్వాలనేది కాజల్ ప్లాన్. అందుకే ఇలా కరోనా టైమ్ లో పెళ్లికి రెడీ అయిపోయింది. దీని వల్ల ఆమె నటిస్తున్న సినిమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Related Stories