హీరోయిన్ నివేథా పేతురాజ్ కి, తమిళనాడుకి చెందిన ఒక యువ రాజకీయ నాయకుడికి మధ్య ఉన్న సంబంధాల గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ వాటిని నివేథా ఇంతకుముందు పట్టించుకోలేదు. ఆ తర్వాత తెలుగు హీరో విశ్వక్ సేన్ తో డేటింగ్ చేస్తోందని రూమర్లు వచ్చాయి. కానీ ఆమె గత కొంతకాలంగా సినిమాలు తగ్గించి తనకిష్టమైన కార్ రేసింగ్ లు, ఇతర క్రీడలపై ఫోకస్ పెట్టింది. అలాగే అనేక దేశాలు పర్యటిస్తోంది.
దాంతో, ఆమెకి సంబంధించిన పుకార్లు పూర్తిగా మరుగునపడ్డాయి. ఐతే ఉన్నట్టుండి ఇప్పుడు ఆమె మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ వార్తలపై ఆమె స్పందించింది. సుదీర్ఘంగా ట్విట్టర్లో రాసుకొంది. ఇంతకీ నివేథా పేతురాజ్ పై వస్తోన్న ఈ కొత్త రూమర్లు ఏంటి? ఆమె ఎందుకు స్పందించింది ఇప్పుడు?
తమిళనాడులో అధికారంలో ఉన్న ఒక పార్టీకి చెందిన యువ నాయకుడు, నటుడు ఆమె కోసం కొంతకాలంగా డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతున్నాడు అని కొన్ని మీడియాలలో వార్తలు వెలువడ్డాయి. దుబాయ్ లో ఆమె కుటుంబం నివసిస్తోంది. వాళ్ళు ఉంటోన్న ఇల్లు కూడా ఈ యువ నాయకుడే కొని ఇచ్చాడు అని ఈ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.
ఇది ఎన్నికల సమయం. ఈ వార్తలను, పుకార్లను పట్టించుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఆమె వేగంగా స్పందించింది.
ALSO READ: Nivetha Pethuraj slams reports of a politician bought her Dubai home
ఆమె సుదీర్ఘంగా రాసిన పోస్ట్ లోని మెయిన్ పాయింట్ ఏంటంటే…
“ఇలాంటి నిరాధార వార్తలు రాసేముందు నేను కూడా ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి అనే జర్నలిస్టులు తెలుసుకోవాలి. మా కుటుంబం ఎలా బాధపడుతుందో అర్థం చేసుకోవాలి. నేను 16 ఏళ్ల వయసు నుంచే సంపాదిస్తున్నాను. మా కుటుంబం గత 20 ఏళ్లుగా దుబాయిలోనే ఉంటోంది. నేను కార్ల రేసింగ్, ఇతర క్రీడలు చాలా కాలంగా ఆడుతున్నాను. వేరే ఎవరో నా గురించి ఖర్చు పెడుతున్నారు అని ఎలా రాస్తారు?
గత 10 ఏళ్ళలో నేను ఎన్నో సినిమాల్లో నటించాను. కానీ ఏనాడూ ఏ నిర్మాతకు, దర్శకుడికి నాకు ఆఫర్లు కావాలని అడగలేదు. రికమెండేషన్ చేయించుకోలేదు.”
ఐతే, ఆమె ఈ రాజకీయనాయకుడితో ఉన్న స్నేహం గురించి అనేకసార్లు ఇబ్బందులు ఎదుర్కున్న మాట వాస్తవమే. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా అతని వల్ల ఆమె పుకార్లని ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో అతన్ని టార్గెట్ చేసే వాళ్ళు ఇలాంటి వార్తలు ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు.