హీరోయిన్ తాప్సి పెళ్లి చేసుకుందని అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు, వెబ్ సైట్లు వార్తలు రాశాయి. గత శనివారం పెళ్లి జరిగింది అనేది ఈ వార్తల సారాంశం. కానీ పెళ్లి వేడుకని అంత రహస్యంగా ఎందుకు ఉంచింది తాప్సి? ప్రేమను సీక్రెట్ గా దాచడం అర్థం చేసుకోవచ్చు. పెళ్లి వేడుకని రహస్యంగా జరుపుకోవడం ఎందుకో?
తాప్సికిప్పుడు 36 ఏళ్ళు. ఆమె అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ మత్యుస్ తో దాదాపు 8 ఏళ్లుగా డేటింగ్ చేస్తోంది. ఇరువైపులా పెద్దలు అంగీకరించారు. మరి ఎంచక్కా అందరికీ తెలియచెయ్యొచ్చు. పెళ్ళికి ముందు చెప్పకపోయినా, పెళ్లి జరిగిన తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచెయ్యడం, ఫోటోలు షేర్ చెయ్యడం అనే పద్దతిని ఇప్పుడు సెలెబ్రిటీలు అందరూ పాటిస్తున్నారు.
గతంలో పెళ్లి మాట వచ్చినప్పుడు నేను ఏమి గర్భవతిని కాదు పెళ్లి చేసుకోవడానికి అని ఇతర హీరోయిన్ల గురించి కామెంట్ చేసింది. ఇప్పుడు ఈమె పెళ్లి విషయాన్నీ సీక్రెట్ గా ఉంచడంతో నెగెటివ్ కామెంట్స్ పడుతున్నాయి.