యష్ నిరీక్షణ దేనికోసమో!

Yash


‘KGF 2’ వంటి సంచలన విజయం తర్వాత కూడా యష్ ఇంకా ఏవేవో లెక్కలు వేస్తున్నాడట. తన కొత్త సినిమా ప్రకటన విషయంలో ఇంకా తర్జన భర్జన పడుతున్నట్లు కనిపిస్తోంది.

గత నెలలోనే కొత్త సినిమా ప్రకటిస్తాడు అని అతని అభిమానులు హడావిడి చేశారు. ట్విట్టర్లో ట్రెండింగ్ జరిపారు. కానీ, అవేవి పట్టించుకోకుండా యష్ తన భార్యతో కలిసి ఇటలీకి విహార యాత్రకు వెళ్ళాడు.

‘కెజిఎఫ్ 2’ హిందీలో 400 కోట్లు కొల్లగొట్టింది. అంత పెద్ద హిట్ అయింది కాబట్టి తన తదుపరి చిత్రం కూడా హిందీతో పాటు ఇతర భాషల్లో అదే విధంగా ఉండాలి అనేది అతని భావన. అందుకే, కన్నడ దర్శకులతో సినిమాలు చెయ్యాలా లేక బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ దర్శకులతో వెళ్ళాలా అనే విషయంలో అతని ఊగిసలాట ఉంది.

దర్శకుడు శంకర్ తో మూవీ ఉంటుంది అని ఆ మధ్య యష్ అభిమానులు హడావిడి చేశారు. కానీ శంకర్ మరో మూడేళ్ళ వరకు బిజీ. రామ్ చరణ్ తో మూవీ తీస్తున్నారు శంకర్. ఇది సెట్స్ పై ఉండగానే ‘భారతీయుడు 2’ మళ్ళీ మొదలుపెట్టనున్నారు శంకర్. ఆ తర్వాత రణవీర్ సింగ్ తో బాలీవుడ్ లో ఒక మూవీ చేస్తారు ఆయన. సో, శంకర్ – యష్ కాంబినేషన్ సెట్ కావాలంటే చాలా టైం పడుతుంది.

Advertisement
 

More

Related Stories