నీళ్ల బాటిల్స్ పై కూడా జంటగా!

Nayanthara wedding celebrations


హీరోయిన్ నయనతార పెళ్లి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం (జూన్ 9న) పెళ్లి ముహూర్తం. కానీ, మూడు రోజులుగా పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. సంగీత్, మెహందీ… ఇలా వరుసగా సెలెబ్రేషన్స్ సాగుతున్నాయి. చెన్నైకి సమీపంలోని మహాబలిపురం వద్ద ఒక రిసార్ట్ మొత్తం వీరి పెళ్లి వేడుకలకు వేదికగా మారింది.

మొత్తం రిసార్ట్ ని అందంగా డెకరేట్ చేశారు. నయనతార, విగ్నేష్ శివన్ ఫోటోలను ప్రతి చోటా అతికించారు. ప్లేట్స్, నీళ్ల బాటిల్స్, నాప్ కిన్స్….అన్నింటిపై ఈ జంట ఫోటోలను ముద్రించారు. ఈ పెళ్లి వేడుకని గౌతమ్ మీనన్ కి చెందిన ప్రొడక్షన్ కంపెనీ షూట్ చేస్తోంది. ఒక అందమైన పెళ్లి ఆల్బమ్ (వీడియో)ని తయారు చేసి ఇవ్వనుంది ఈ టీం. కుదిరితే ఏదైనా ఒక ఓటిటి వేదికపై కూడా ప్రసారం చెయ్యాలని అనుకుంటున్నారట.

నయనతార కల మొత్తానికి నెరవేరింది. ఘనంగా పెళ్లి చేసుకోవాలనేది ఆమె డ్రీం. ఆమె ఆలోచన ప్రకారమే పెళ్లి థీమ్ ని సెలెక్ట్ చేశారట. పెళ్లి రిసెప్షన్ కి తమిళ సినిమా తారలు అందరూ విచ్చేయనున్నారు.

నయనతారకి 35 ఏళ్ళు. ఆమె తమిళ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. నయన్ విగ్నేష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రభుదేవాతో బ్రేకప్ అయిన ఏడాది తర్వాత నయనతార విగ్నేష్ తో ప్రేమలో పడింది. ఐదేళ్ల రిలేషన్ షిప్ కి ఈ జంట పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తోంది.

 

More

Related Stories