సమంతపై విచిత్రమైన రూమర్లు

సమంతకి పుకార్లు కొత్త కాదు. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత, విడాకుల సమయంలో, ఆ తర్వాత …ఎప్పుడూ ఏవో ఒక రూమర్లు ఆమె ఫేస్ చేసింది. ఐతే ఇప్పుడు మౌనంగా ఉండడం కూడా ఒక సమస్యే అయింది.

భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఏడాది పాటు ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంది సమంత. ఫోటోలు, వీడియోలతో రెచ్చిపోయింది. దాంతో, ఆమెకి దాదాపు 25 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు ఇన్ స్టాగ్రామ్ లో. కానీ, మూడు నెలలుగా సైలెంట్ అయిపొయింది. దాంతో, రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

మళ్ళీ పెళ్లి చేసుకోవాలని సమంత తల్లి ఒత్తిడి చేస్తోందని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆమె అన్నింటికీ దూరమై సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టిందని ఒక వార్త సారాంశం. సమంత ఇటీవల సర్జరీ చేయించుకుందని, ఇంకా దాన్నుంచి కోలుకోలేదని, అందుకే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండట్లేదు అని మరో వెబ్సైట్ పుకారు.

ఇంకా ఇక్కడ రాయలేని ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో చలామణిలో ఉన్నాయి. ఐతే, ఇవన్నీ అబద్దాలే. ఒక్క ఊహాగానంలో కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. ఆమె హ్యాపీగా ఉన్నారు. సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

Samantha

సమంత ప్రస్తుతం హిందీలో ఒక వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ షూటింగ్ జరుగుతోంది. అలాగే, తెలుగులో ‘ఖుషి’ షూటింగ్ ఉంది. ఇటీవలే ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఒక పాట షూటింగ్ లో పాల్గొంది ‘ఖుషి’ చిత్రం కోసం.

సమంత ఇన్ స్టాగ్రామ్ లో మౌనం పాటించడానికి నిజమైన కారణం ఏంటో చెప్పలేం కానీ సోషల్ మీడియాలో, మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఇసుమంత కూడా నిజం లేదంట.

 

More

Related Stories