ఇప్పుడు ఐశ్వర్య తెలుగులో చేస్తుందా?

Aishwarya Rai


ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే జనానికి తెగ క్రేజ్. హీరోలు కూడా ఆమెతో నటించాలనేది తమ డ్రీం అనేవాళ్ళు. ఇప్పుడు ఆమె వయసు పెరిగింది. మునుపటి అందం, క్రేజ్ లేదు.

49 ఏళ్ల ఐశ్వర్య రాయ్ ఇటీవల తన గురువు మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రాల్లో నటించింది. అవి మంచి విజయం సాధించాయి. కానీ, ఆ సినిమాలో ఆమె అందం కన్నా ఆమె పాత్రకు ఉన్న బలం వేరు. ఐతే, ఐశ్వర్యరాయ్ తమ సినిమాలో నటిస్తే వచ్చే “బలం” వేరు అనుకునే హీరోలు, దర్శకులు ఇప్పటికీ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం మేకర్స్ కూడా ఆ లిస్టులో ఉన్నారనుకోవాలి.

‘మెగా 157″ అనే కొత్త చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అనుష్క శెట్టి, ఐశ్వర్య రాయ్ లను ఈ సినిమాలో తీసుకోవాలనుకుంటున్నారు. అనుష్క శెట్టి నటించొచ్చు ఎందుకంటే ఈ సినిమాని నిర్మించేది యువి క్రియేషన్స్ సంస్థ. ప్రభాస్ కుటుంబానికి చెందిన ఆ నిర్మాణ సంస్థ కోసం అనుష్క సులువుగానే ఒప్పుకుంటుంది.

ఐతే, ఐశ్వర్య రాయ్ ని ఒప్పించడం అంత ఈజీ కాదు. అందుకే రామ్ చరణ్ తో రంగంలోకి దింపి ఆమెని ఒప్పించేలా చేస్తారట. చిరంజీవి – రామ్ చరణ్ కుటుంబానికి అమితాబ్ బచ్చన్ కుటుంబానికి మంచి స్నేహబంధం ఉంది. ఒకవేళ ఐశ్వర్య ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమాకి క్రేజ్ వస్తుంది. అనుష్క – చిరంజీవి కాంబినేషన్ కి పెద్దగా స్పందన ఉండదు అభిమానుల నుంచి.

Advertisement
 

More

Related Stories