ఇకపై అన్నీ బిర్యానీలేనా?

Anupama Parameswaran

ఒకప్పుడు పక్కింటి అమ్మాయి అనిపించుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు రూట్ మార్చింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో గ్లామర్ ఐకాన్ గా మారింది. అందాలు ఆరబోయడంలోనే కాదు ముద్దులు పెట్టేస్తోంది. బెడ్ రూం సీన్లలో నటిస్తోంది. త్వరలో విడుదల కానున్న “టిల్లు స్క్వేర్”లో ఆమె విశ్వరూపం చూడొచ్చు.

కేవలం ఈ సినిమా వరకే ఇలా కనిపించిందా? ఇకపై కూడా అలాగే దర్శనమిస్తుందా? “ఎప్పుడూ పులిహోర తింటే ఎలా? అప్పుడప్పుడు బిర్యానీ ఘాటు కూడా తగిలాలి కదా” అనేది ఆమె సమాధానం.

అంటే ఒద్దికగా ఉండే సాంప్రదాయ పాత్రలు చేస్తూనే అప్పుడప్పుడు మాత్రమే ప్రేక్షకులకు తన ఒంపుసొంపుల బిర్యానీ వడ్డిస్తుంది అన్నమాట.

“రౌడీ బాయ్స్” అనే చిత్రంతో ఆమె ఈ “బిర్యానీ మసాలా” చూపించింది. ఆ తర్వాత “కార్తికేయ 2”, “18 పేజెస్”, “ఈగిల్” వంటి చిత్రాల్లో సాధారణ పద్దతిలోనే నటించింది. మళ్ళీ ఇప్పుడు “టిల్లు స్క్వేర్”లో లిల్లీ పాత్రలో జాలీగా రెచ్చిపోయింది.

Advertisement
 

More

Related Stories