ఎన్టీఆర్ ని ఇబ్బందిపెడుతారా?

- Advertisement -
NTR in Devara

జూనియర్ ఎన్టీఆర్ కి, నందమూరి బాలకృష్ణకి ఇప్పుడు అస్సలు పడడం లేదు. అబ్బాయిపై పేరు ఎత్తితే బాబాయి కస్సుమని లేస్తున్నారు. ఆ మధ్య బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసెయ్యమని ఆర్డర్ వేసిన వైనం చూశాం.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కి సోలో డేట్ దక్కకుండా తన సినిమాని కూడా విడుదల చెయ్యాలని బాలయ్య అనుకుంటున్నట్లు టాక్.

కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. “దేవర” మొదటి భాగాన్ని మొదట ఏప్రిల్ 5న విడుదల చేద్దామనుకున్నారు. కానీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ టైంకి పాటలు అందివ్వలేదు. అలాగే, వీఎఫ్ ఎక్స్ పనులు కూడా ఏప్రిల్ లోపు పూర్తి కావు. దాంతో, సినిమాని దసరాకి వాయిదా వేశారు. అక్టోబర్ 10 తమ కొత్త డేట్ అని అనౌన్స్ చేసింది “దేవర” టీం.

ఇక ఇప్పుడు అదే డేట్ కి అటూ ఇటూగా బాలయ్య సినిమా కూడా రానుంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చాక బాలయ్య మొత్తంగా సినిమా షూటింగ్ ని నిలిపివేస్తారు. మళ్ళీ ఎన్నికల ఫలితాల తర్వాతే షూటింగ్ లో జాయిన్ అవుతారు.

అందుకే, ఈ సినిమా నిర్మాణ సంస్థ ఈ సినిమాని దసరాకి విడుదల చేద్దామని ప్లాన్ చేస్తోందట. ఒకవేళ బాలయ్య సినిమా వస్తే జూనియర్ కి ఇబ్బందే. కలెక్షన్ల విషయంలో కొంత కోత పడుతుంది. ఒకే కుటుంబానికి చెందిన హీరోల సినిమాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలి. మరి బాలయ్య చివరికి ఏమి చేస్తారో?

 

More

Related Stories