
మెగాస్టార్ చిరంజీవిని త్వరలోనే రాజ్యసభకు పంపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది అని మీడియా కథనాలు. ఆ ప్రతిపాదనకు మెగాస్టార్ ఒప్పుకుంటారా? చిరంజీవి ఇప్పటికే రాజకీయాలపై విసుగెత్తి ఉన్నారు. వాటికి దూరంగా ఉంటున్నారు. ఆయన తమ్ముడు జనసేన పార్టీ పెట్టి… ఏపీ రాజకీయాల్లో తన ప్రయత్నాలు చేస్తున్నారు. సుదీర్ఘ లక్ష్యం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్.
మరి పవన్ కళ్యాణ్ రాజకీయాలను దెబ్బతీసేలా, కాపు ఓటు లక్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ చిరంజీవిని రాజ్యసభకు పంపాలని అనుకుంటోంది అని టాక్. మరి దానికి చిరంజీవి ఒప్పుకుంటారా?
చిరంజీవి తన తమ్ముడు రాజకీయాన్ని దెబ్బతీసే పని చేస్తారని అనుకోలేం. జగన్ ప్రతిపాదనలకు చిరంజీవి ఒప్పుకుంటే ఏపీ రాజకీయాలు మలుపు తిరుగుతాయి. కానీ, ఈ వార్తల్లో పెద్దగా నిజం లేదనిపిస్తోంది.