దిశా పటానికే ఓటేస్తారా?

Disha Patani

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందే “సలార్” సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంటారు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. బాలీవుడ్ భామ దిశా పటాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐతే, ప్రశాంత్ నీల్ మాత్రం సౌత్ ఇండియన్ భామ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాని పాన్ -ఇండియా ప్రాజెక్ట్ గా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటివరకు తన పాన్-ఇండియా సినిమాలన్నిటికి బాలీవుడ్ హీరోయిన్లనే తీసుకుంటున్నారు. ఆ లెక్కన దిశా పటానికి అవకాశం ఉంది.

దిశా పటాని తెలుగులో “లోఫర్” సినిమాలో నటించింది. ఆమె బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ గల్ ఫ్రెండ్ గా పాపులర్ అయింది. అలాగే, ఇన్ స్టాగ్రామ్ లో మంచి గ్లామర్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ హడావిడి చేస్తుంటుంది. మరి ఈ భామకి ఫైనల్ గా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వస్తుందా?

“సలార్” షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా డాన్ లని ఎదిరించే ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తారు.

More

Related Stories