ఈ ఆరబోత ఉపయోగపడేనా?


ఒకప్పుడు హీరోయిన్లు అందాలు ఆరబోస్తే ఆ భామలకు ఎక్కువగా అవకాశాలు వచ్చేవి. గ్లామర్ పాత్రలకు తీసుకునేవారు మేకర్స్. కానీ, కాలం మారింది. ఈ రోజుల్లో అందాలు ఆరబోయని భామలే తక్కువ. అందరూ అదే పని చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో హీరోయిన్ చూపించే అందచందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

అందుకే, గ్లామర్ షో చేస్తే అవకాశాలు వస్తాయి అనుకోవడం ఇప్పుడు తప్పు. ఐతే, సినిమాల్లో అవకాశాల కోసం కాకపోయినా ఇన్ స్టాగ్రామ్ లో పాపులారిటీ, ఫాలోవర్స్ కోసమని చాలామంది భామలు నిత్యం కవ్వించే ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఆ జాబితాలో కేతిక శర్మ ఉంది.

పూరి జగన్నాధ్ తీసిన ‘రొమాంటిక్’ చిత్రంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమె సోయగాల షో చూసి మరో రెండు సినిమాల్లో ఆఫర్లు ఇచ్చారు. నాగ శౌర్య సరసన ‘లక్ష్య’, వైష్ణవ్ తేజ్ తో ‘రంగ రంగ వైభవంగా’ సినిమాల్లో నటించింది ఈ భామ. ఐతే ఆమె నటించిన మూడు చిత్రాలూ అపజయం చెందాయి. దాంతో, ఆమె ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

అందచందాల ఆరబోత కన్నా సినిమా ఇండస్ట్రీలో హిట్ రేట్ ముఖ్యం. అది ఉంటే మిగతావి అవసరం లేవు.

ఐతే, ఈ భామకి అందంతో పాటు టాలెంట్ కూడా ఉంది. మంచి నటనే ప్రదర్శిస్తుంది. ఐతే, లక్ కలిసి రావడం లేదు. కేతిక శర్మకి మరికొన్ని అవకాశాలు ఇచ్చి చూస్తారా మన మేకర్స్.

 

More

Related Stories