పెళ్లి తర్వాత హన్సిక నటిస్తుందా?

ఒకప్పుడు పెళ్లికి సిద్ధం అయ్యారంటే కెరీర్ కి శుభం కార్డు వేసినట్లే అనుకునేది ఇండస్ట్రీ. కానీ కాలం మారింది. హీరోయిన్ల ఆలోచన ధోరణి మారింది. దానికి తగ్గట్లే ప్రేక్షకులు కూడా పెళ్లి అయిన హీరోయిన్ల సినిమాలు చూడం అనే రాతియుగం ఆలోచనల నుంచి బయటికి వచ్చారు. సమంత పెళ్లి తర్వాత కూడా పెద్ద సక్సెస్ లు చూసింది. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ తల్లి అయిన తర్వాత కూడా సినిమాలు చెయ్యడం మొదలు పెట్టింది.

ఇప్పుడు హన్సిక పెళ్ళికి రెడీ అవుతోంది. ఈ అమ్మడు సంగతేంటి. హన్సిక ముందే క్లారిటీ ఇచ్చేసింది పెళ్లి తర్వాత కూడా నటిస్తాను అని చెప్పింది.

డిసెంబర్ 4న ఆమె పెళ్లి. సోహైల్ అనే వ్యాపారవేత్తని ఆమె పెళ్లాడనుంది. ఆమె, సోహైల్ చాలా కాలంగా స్నేహితులు. వారి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. సో, ఆమె యాక్టింగ్ కెరీర్ తో అతనికి ఏ అభ్యంతరం లేదు.

ఐతే, ఆమెకిప్పుడు అవకాశాలు వస్తాయా అనేది డౌటే. ఆమె కెరీర్ ప్రస్తుతం డల్ గా సాగుతోంది. ఆమెకి క్రేజ్ పోయి చాలా కాలమే అయింది. పెళ్లితో సంబంధం లేకుండా ఆమె కెరీర్ కష్టాల్లో ఉంది. పెళ్లి తర్వాత ఆమెకి ఆఫర్లు వస్తాయా అన్నది డౌటే.

 

More

Related Stories