‘కల్కి’ ఒకటా? రెండు భాగాలా?

- Advertisement -
Kalki 2898 AD

ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న “కల్కి” సినిమాకి సంబంధించి నిర్మాతలు ఇటీవల విడుదల తేదీ ప్రకటించారు. మే 9న “కల్కి 2898 AD” విడుదల అవుతుందని స్పష్టం చేశారు. ఐతే, ఈ సినిమా మొదటి భాగం ఈ తేదీన వస్తుందా లేదా మొత్తంగా ఒకే సినిమా తీశారా అన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

“సలార్” రెండు భాగాలుగా తీస్తున్నట్లు ముందే ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ లో విడుదలైన “సలార్: సీజ్ ఫైర్” మొదటి భాగం. రెండో భాగం షూటింగ్ ఇంకా పూర్తి చెయ్యలేదు. అది ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు.

ఐతే, “కల్కి” సినిమా షూటింగ్ లో ఇటీవలే కమల్ హాసన్ పాల్గొన్నారు. ఆయన ఎక్కువ రోజులు పని చెయ్యలేదు. అందుకే, ఈ సినిమాకి సంబంధించి కూడా రెండో భాగం ఉంటుంది అన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడిని విలన్ పాత్రకు తీసుకొని వారం రోజుల షూటింగ్ మాత్రమే చెయ్యలేరు కదా. ఆయన పాత్ర నిడివి మొదటి భాగంలో తక్కువగా ఉండి రెండో భాగంలో ఎక్కువగా ఉంటుంది అనే మాట వినిపిస్తోంది.

పైగా ఈ సినిమా బడ్జెట్ మొత్తం రికవరీ కావాలంటే రెండు భాగాలు బెటర్. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.

“కల్కి 2898 AD” చిత్రానికి దర్శకుడు నాగ్ అశ్విన్. అశ్వనీదత్ నిర్మాత. ప్రభాస్ సరసన దీపిక పదుకోన్, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు.

 

More

Related Stories