కీర్తి సురేష్ ఆ కోరిక నెరవేరుతుందా?


ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి అన్నట్లు తయారు అయింది కీర్తి సురేష్ పరిస్థితి.

టాప్ పొజిషన్ పై దృష్టిపెట్టి ఆ దిశగా మెల్లమెల్లగా అడుగులు వేస్తున్న కీర్తికి.. ఈ ఏడాది లక్ మారినట్లు కనిపించింది. “సర్కార్ వారి పాట”లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కినప్పుడు కీర్తి సురేష్ టాప్ హీరోయిన్ గా ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. “సర్కారువారి పాట” సినిమా పెద్దహిట్టయితే… ఆమె తెలుగులో పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లకు నిద్రపట్టకుండా చేస్తుందనుకున్నారు. కానీ, ఆ సినిమా సో సో అనిపించుకుంది.

దాంతో, ఆమెకి ఇతర పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు ఇప్పటి వరకు రాలేదు.

కమర్షియల్ సినిమాల్లో అవకాశాల కోసమే ఆమె ఇటీవల గ్లామర్ షో చేస్తోంది. ఫోటోషూట్ లతో కిరాక్ పుట్టిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్ వస్తుందనుకుంటే అటువైపు నుంచి పిలుపు రావడం లేదు.

Keerthy Suresh

ప్రస్తుతం ఆమె చిరంజీవి నటిస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో చెల్లెలు పాత్ర పోషిస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎలాగూ ఉన్నాయి. కానీ ఇతర పెద్ద హీరోల సరసన నటించాలన్న ఆమె కోరిక ఎప్పుడు నెరవేరుతుందో.

 

More

Related Stories