మోసగాళ్లు హాలీవుడ్లో రిలీజ్ అవుద్దా?

Kajal Aggarwal, Manchu Vishnu in Mosagallu

గతవారం విడుదలైన ‘మోసగాళ్లు’ సినిమాని తెలుగుతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో తీశామని ప్రకటించాడు హీరో, నిర్మాత మంచు విష్ణు. ఈ సినిమాకి దర్శకుడు కూడా అమెరికాకి చెందిన ఫిలింమేకర్. తెలుగు వర్షన్ కన్నా హాలీవుడ్ వర్షన్ అదిరిపోతోంది, ఇంటర్ నేషనల్లో భారీ ఎత్తున విడుదల చేస్తామని విష్ణు రిలీజ్ కి ముందు చాలా చెప్పాడు. తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

మరి ఇప్పుడు ఇంటర్ నేషనల్ వర్షన్ రిలీజ్ చేస్తాడా? తెలుగులోనే ఎవరూ పట్టించుకోలేదు మరి గ్లోబల్ వేదికపై అంత సీన్ ఉంటుందా?

మంచు విష్ణుకి ఓ మోస్తారు హిట్ వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతోంది. ఇప్పుడు ‘ఢీ2’తో రానున్నాడు. ఈ సినిమా అటు విష్ణుకి, ఇటు దర్శకుడు శ్రీను వైట్లకు ఇంపార్టెంట్. ఇద్దరూ అపజయాలతో సతమతమవుతున్నారు.

More

Related Stories