- Advertisement -

ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అంటే హీరోలకి సమానంగా క్రేజ్ ఉండేది. నిర్మాతగా ఆయన అందించిన బ్లాక్ బస్టర్స్ అలాంటివి మరి. శతృవు, దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఇలా ఎన్నో హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.
అలాంటి నిర్మాత ఇప్పుడు క్రేజ్ కోల్పోయారు. ఇంకా చాలా పోగుట్టుకున్నారు. ఇప్పుడు పాత పేరును పక్కన పెట్టి, సక్సెస్ కోసం సెక్స్ ప్రాధాన్య చిత్రంతీశారు. అదే డర్టీ హారి. పేరులో డర్టీ ఉంది. కథలో మసాలా ఉంది. కానీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ని మాత్రం మరీ డర్టీ పిక్చర్ కాకుండా చూసుకున్నారు.
కొంతలో కొంత తక్కువ మసాలా డోస్ వేశారు. ఐతే, సినిమాలో మాత్రం సరుకు ఎక్కువే ఉంటుందట. అందుకే, థియేటర్లకి బదులు “ATT”లో రిలీజ్ చేస్తున్నారు. అంటే.. ఆన్లైన్ లో మనీ కట్టి మూవీ చూడాలి.