నాగార్జున ఓపెనింగ్ తేగలడా?

Nagarjuna

ఈ ఏడాది రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేసిన సినిమాలన్నింటికీ మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్ అన్ని సినిమాలకు కీలకంగా మారింది. నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’కి ఓపెనింగ్ వస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ సినిమాని డైరెక్ట్ గా ఒటిటి లో రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ మంచి అమౌంట్ ఇచ్చి కొనుక్కొంది. కానీ, నాగార్జున ఆ అగ్రిమెంట్ ని రద్దు చేసి థియేటర్లలో విడుదల చేస్తున్నాడు.

థియేటర్లో మంచి ఓపెనింగ్ వస్తే … నాగార్జున తీసుకున్న నిర్ణయానికి ఫలితం దక్కుతుంది. లేదంటే నిర్మాతలు బాధపడతారు. అందుకే, ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్ వెరీ ఇంపార్టెంట్.

నాగార్జున రీసెంట్ గా నటించిన “రాజుగారి గది 2”, “ఆఫీసర్”, “మన్మధుడు 2” సినిమాలు దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఆయన సోలో హీరోగా ఎంతవరకు ఓపెనింగ్ తీసుకొస్తాడు అనేది చూడాలి. ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. నాగార్జున లక్ ఏంటంటే.. ఈ సినిమాతో పోటీపడాలనుకున్న ‘సీటిమార్’ చివరి నిమిషంలో వాయిదాపడడం.

More

Related Stories