మరి ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా?

NTR and Buchi Babu

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు బుచ్చిబాబు. ‘రంగస్థలం’ రైటర్స్ లో ఒకరిగా పాపులర్ అయి…. ‘ఉప్పెన’ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టాడు. అంతకుముందు సుకుమార్ వద్ద అనేక సినిమాలకు అసిస్టెంట్ గా వర్క్ చేశాడు బుచ్చిబాబు. ఐతే, ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి ముందు బుచ్చిబాబు ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పాడు. ఆ స్టోరీతో పాటు ‘ఉప్పెన’ నేరేషన్ కూడా ఇచ్చాడు.

బుచ్చిబాబు స్టోరీ నేరేషన్ కి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్… తన ఇమేజ్ కి తగ్గ మంచి కథతో వస్తే మూవీ చేస్తాను అని ప్రామిస్ చేశాడట. “ఉప్పెన” పెద్ద హిట్ ఐతే బుచ్చిబాబుకి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’, ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒకటి, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో మూవీ చేస్తాడు. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యేసరికి రెండేళ్లు పడుతుంది.

ఈ గ్యాప్ లో బుచ్చిబాబుకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వాలంటే… ఉప్పెన కళ్ళు చెదిరే హిట్ కావాలి.

More

Related Stories