ఓజి – సాహోనా? పంజానా?

పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకి “ఓజి” అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు కానీ సినిమా ప్రారంభం మాత్రం ఘనంగా జరిగింది.

సుజీత్ ‘సాహో’ సినిమాతో అందరికీ పరిచయం అయ్యాడు. అంతకుముందు తీసిన ‘రన్ రాజా రన్’తోనే గుర్తింపు వచ్చినా ఎక్కువ పాపులర్ అయింది మాత్రం ‘సాహో’. ఆ సినిమా ఆడలేదు కానీ అతని మేకింగ్, టేకింగ్ గ్రాండ్ గా కనిపించాయి.

మరి ఇప్పుడు ఈ “ఓజి” ఎలా తీస్తాడో? సినిమా కథానేపథ్యం మాఫియా వార్ అని తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ ‘పంజా’ అనే గ్యాంగ్ స్టర్ చిత్రం చేశారు. ఇది అలా ఉంటుందా లేక ‘సాహో’లా ఉంటుందా అనేది చూడాలి.

ఈ సినిమాలో పాటలు ఉండవు, హీరోయిన్లు ఉండరు అన్న వార్తలు పూర్తిగా తప్పు. అన్నీ ఉంటాయి.

Advertisement
 

More

Related Stories