2025లోపు క్లియర్ అవుతాయా?

Prabhas

ప్రభాస్ అనేక సినిమాల్లో నటిస్తున్నారు. దానికి తోడు మరికొన్ని కాంబినేషన్లు పుట్టుకొస్తున్నాయి. కానీ కొత్త కాంబినేషన్ల కన్నా ముందు ఒప్పుకున్న సినిమాలు విడుదల చెయ్యాలి. ప్రస్తుతం ఆయన సినిమాలన్నీ వాయిదాల జపం చేస్తున్నాయి. జనవరిలో విడుదల కావాల్సిన ‘ఆదిపురుష్’ జూన్ 2023కి వాయిదా పడింది. అదే బాటలో ‘సలార్’ వెళ్లనుంది.

వచ్చే సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన ‘సలార్’ కనుక 2024 సంక్రాంతికి మారిందంటే పెద్ద సమస్యే. ఎందుకంటే ‘ప్రాజెక్ట్ కే’ అనే మరో సినిమాకి 2024లోనే డేట్ ఫిక్స్ చెయ్యాలి. అలాగే మారుతీ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ కూడా సెట్స్ పై ఉంది. ఇవన్నీ 2025లో ‘క్లియర్’ అవుతాయా? 

‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, ‘మారుతి సినిమా’ విడుదల అయిన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే సినిమా మొదలు పెట్టాలి. ఇంత కలగాపులగం ఉంది కాబట్టే ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలన్నీ 2025లోపు క్లియర్ అవుతాయా అన్న డౌట్ వస్తోంది.

ఈ సినిమాలన్నింటికీ కలిపి ప్రభాస్ దాదాపు 400 కోట్ల రూపాయల పారితోషికం పొందారు.

 

More

Related Stories