2023లోనా? 2024లోనా?

Allu Arjun


‘పుష్ప’ సినిమా గతేడాది డిసెంబర్లో విడుదలైంది. ఇప్పుడు మనం 2022 అక్టోబర్లో ఉన్నాం. కానీ ఇంతవరకు ‘పుష్ప 2’ షూటింగ్ మొదలు కాలేదు. మొదటి భాగం విడుదలైన 10 నెలల తర్వాత కూడా రెండో భాగం మొదలు కాలేదంటే ఇక ఈ సినిమా విడుదల గురించి ఏమి చెప్పగలం.

సుకుమార్ సాధారణంగా ఒక సినిమాని ఏడాదిన్నర, రెండేళ్లపాటు తీస్తారు. ‘పుష్ప 2’ విషయంలో ఇంకా ఎక్కువ శ్రద్ద పెట్టడం గ్యారెంటీ. “అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది విడుదల చేస్తాం,” అని అల్లు అర్జున్ తాజాగా తెలిపారు. CNN18 ఛానెల్ అల్లు అర్జున్ కి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చింది. ఆ సందర్భంగా పుష్ప 2 విడుదల గురించి వెల్లడించారు. “2023లో విడుదల చెయ్యాలని ఆశ,” అని డౌట్ ఫుల్ గా చెప్పారు.

బన్నీకి కూడా తెలుసు సుకుమార్ ఎప్పుడు పూర్తి చేస్తాడో చెప్పలేం అనేది. అందుకే, వచ్చే ఏడాది సినిమా విడుదల అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేక పోతున్నాడు.

ఈ నెలాఖరులో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ 2023లో రిలీజ్ చెయ్యాలనేది ప్లాన్. ఐతే, ఒకవేళ షూటింగ్ పూర్తి కాకపోతే 2024 సమ్మర్లో చేస్తారు. ‘పుష్ప 2’ కోసం అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక భారీ పారితోషికాలు తీసుకుంటున్నారు. మొదటి భాగానికి తీసుకున్న దానికి డబుల్ డబ్బులు తీసుకుంటున్నారని టాక్.

Advertisement
 

More

Related Stories