రాధేశ్యామ్ డేట్ మార్చక తప్పదా ?

Radhe Shyam

“లవ్ స్టోరీ”, “విరాటపర్వం”, “టక్ జగదీష్” వంటి మీడియం రేంజ్ సినిమాలే కాదు ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమాలు కూడా వాయిదా బాట పట్టాయి. కోవిడ్ అస్తవ్యస్తం చేస్తోంది మొత్తం సినిమా పరిశ్రమని. దాంతో, మరో పెద్ద సినిమా గురించి చర్చ మొదలైంది. ‘రాధేశ్యామ్’పై ఫోకస్ పడింది.

ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రూపొందుతోన్న ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్.. జులై 30. కానీ ఆ డేట్ కి విడుదల అవుతుందా అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఈ సినిమాకి సంబంధించి ఒక పాట షూటింగ్ మిగిలే ఉంది. అది పూర్తి చెయ్యడం పెద్ద సమస్య కాదు. కానీ జులై 30 నాటికీ బాలీవుడ్ మార్కెట్ కోలుకుంటుందా అనేదే ప్రశ్న.

ప్రభాస్ సినిమాకి నార్త్ ఇండియా మార్కెట్ ముఖ్యం. బాలీవుడ్ పెద్ద హీరోల రేంజ్ లోనే ప్రభాస్ సినిమాలు నార్త్ ఇండియాలో విడుదలవుతాయి. కానీ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. మరి ప్రభాస్ రాధేశ్యామ్ పరిస్థితి ఏంటి?

More

Related Stories