సమ్మర్ కి రాధేశ్యామ్ వస్తుందా?

Radhe Shyam

ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. అక్కడ ఆన్ లొకేషన్ లో ప్రభాస్ కి సంబదించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక ఫోటోలు వచ్చాయి. అలాంటిదే… పై ఫోటో. ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో భాగంగా ప్రభాస్ పై తీసిన ఈ స్టిల్.

మరోవైపు ఈ సినిమా ఇటలీ షూటింగ్ చివరి దశకు వచ్చింది ఈ వీకెండ్ టీం అంతా ఇండియాకి వచ్చేస్తుంది అనేది టాక్. ఇప్పటికే తన పూర్తి చేసుకొని పూజ హెగ్డే ఇండియాకి వచ్చేసింది. ఐతే, ఇటలీ బీచుల్లో ఎంజాయ్ చేసిన కొన్ని ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

”రాధేశ్యామ్” యూరోపియన్ బ్యాక్ డ్రాప్ లో పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇందులో విక్రమాదిత్య రోల్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమాను విడుదల చెయ్యాలనేది ప్లాన్. ఐతే, ఖచ్చితంగా వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేము. ఈ సినిమాకి సంబంధించిన మిగతా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ అయ్యేదాన్ని బట్టి రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది.

Related Stories