రాజమౌళికి ఈసారి సెగ తప్పదా?

Rajamouli

దర్శకుడు రాజమౌళికి వివాదాలు కొత్త కాదు. బాహుబలి టైమ్ లోనే కొన్ని సీరియస్ కాంట్రవర్సీస్ ఫేస్ చేశాడు జక్కన్న. అప్పట్లో ఏకంగా బాహుబలి టైటిల్ పై కూడా వివాదం చెలరేగింది. అయితే ఈసారి అంతకంటే ఇంకాస్త ఎక్కువగానే రాజమౌళి చుట్టూ వివాదాలు ముసురుకునేలా కనిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం “ఆర్ఆర్అర్” మూవీ నుంచి ఎన్టీఆర్ టీజర్.

టీజర్ లో ఎన్టీఆర్ ను కొమరం భీమ్ గెటప్ లో పవర్ ఫుల్ గా చూపించాడు జక్కన్న. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు భీమ్ అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే టీజర్ చివర్లో తారక్ ను ముస్లిం గెటప్ లో చూపించాడో చిక్కంతా అక్కడే వచ్చింది. అసలు వివాదానికి అదే కేంద్ర బిందువైంది.

కొమరం భీమ్ ను ముస్లిం గెటప్ లో చూపించిన సన్నివేశాలు తీసేయాలంటూ ఇప్పటికే ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. తాజాగా కొమరం భీమ్ మనవడు కూడా ఈ సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తంచేశాడు. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ దీనిపై స్పందించడం మరింత వివాదాస్పదమైంది.

NTR in RRR

కొమరం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు హెచ్చరించారు. కొమరం భీమ్ తమ పాలిట దేవుడని, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారాయ. ఓవైపు ఈ క్యారెక్టర్ ను ఫిక్షన్ గా రాజమౌళి చెబుతున్నప్పటికీ.. పాత్రకు కొమరం భీమ్ అనే పేరు పెట్టడంతో మేటర్ వివాదాస్పదమైంది.

Related Stories