రజనీకాంత్ పార్టీ ప్రకటన ఉంటుందా?

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి, హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిపోయారు.

డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ గురించి ప్రకటన చేస్తానని రజినీకాంత్ ప్రకటించారు ఇంతకుముందు. 2021 సమ్మర్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఐతే, సడెన్ గా ఆయనకి బ్లడ్ ప్రెజర్ సమస్యలు రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది.

డిశ్చార్జ్ అయిన కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా డెలికేట్ గానే ఉంది. అందుకే, ఆయన ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టొద్దని చెప్పారు డాక్టర్లు. రజినీకాంత్ కి ఇంతకుముందు ట్రాన్స్ ప్లాంట్ జరిగింది కాబట్టి… ఆయన చాలా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెప్పడం మెయిన్ పాయింట్. నాలుగేళ్ళ క్రితం రజినీకాంత్ ఆరోగ్యం బాగా క్షీణించండంతో సింగపూర్, అమెరికాలో ఆయన వైద్యం చేయించుకున్నారు. అప్పుడే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది.

“ఒక వారం పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అలాగే, ఎటువంటి ఫీజికల్ ఆక్టీవిటిస్ లో పాల్గొనొద్దు. కోవిడ్ 19 నేపథ్యంలో కరోనా సంక్రమించకుండా కొన్ని ఇతర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి,” అని డాక్టర్లు చెప్పినట్లు హాస్పిటల్ ప్రకటన తెలిపింది.

అంటే… ఇన్ డైరెక్ట్ గా ఆయన మీటింగులు, షూటింగులకు దూరంగా ఉండాలి అని చెప్పారు డాక్టర్స్. ఈ లెక్కన డిసెంబర్ 31న ఆయన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తారా అనేది చూడాలి.

More

Related Stories