
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు చేసిన ప్రకటన కలకలం రేపింది. ఆయన పార్టీ పెట్టలేడు, ఆయన ఆరోగ్యం అందుకు సహకరించదు అనుకున్న అందరికి ఒక షాక్. తమిళనాడు రాజకీయాలు ఇక రసవత్తరంగా మారనున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ ల్లోనో, మే నెలల్లోనో జరగనున్నాయి. అంటే ఎన్నికలకు సిక్స్ మంత్స్ టైం కూడా లేదు.ఇంత తక్కువ టైంలో ఆయన పార్టీ పెట్టి విజయం సాధించగలడా? గతంలో ఎన్టీఆర్ కి ఆ రికార్డ్ ఉంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. అది తిరుగులేని రికార్డు. ఇప్పటివరకు ఇండియాలో ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైంది.
మరి, రజినీకాంత్ ఆ రికార్డ్ బద్దలుకొట్టగలడా?
ఎన్టీఆర్ స్పూర్తితో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి రావాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు గెలిచింది. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మరి సూపర్ స్టార్ రజినీకాంత్ మరో ఎన్టీఆర్ అవుతారా? మరో చిరంజీవి అవుతారా? అన్నది కాలమే చెప్పాలి.