డ్రగ్స్ మరక: రకుల్ స్పందిస్తుందా?

రియా కేసు అటు ఇటు తిరిగి మన టాలీవుడ్ హీరోయిన్ రకుల్ కి కూడా చుట్టుకొంది. ఆమె పేరు కూడా ఇందులో చేరింది.

తనతో పాటు హీరోయిన్లు సారా అలీ ఖాన్, రకుల్ కూడా సుశాంత్ తో కలిసి పార్టీల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు రియా వెల్లడించిందంట. అందులో నిజానిజాలు ఎంత, నిజంగా వెల్లడించిందా అన్నది కచ్చితంగా చెప్పలేము కానీ మోదీ అనుకూల మీడియాగా ముద్రపడ్డ “టైమ్స్ నౌ” ఛానల్ ఆలా బ్రేకింగ్ న్యూస్ వేసింది.

దాంతో నిన్నటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. దాదాపుగా అన్ని వెబ్ మీడియాల్లోనూ రకుల్ పేరు మార్మోగింది. మరి, రకుల్ ఈ విషయంలో స్పందిస్తుందా?

Also Read: Rhea names Rakul in interrogation?

రకుల్ ప్రస్తుతం క్రిష్ తీస్తున్న కొత్త సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ లో జరుగుతోంది. “కొండ పొలం” అనే నవల ఆధారంగా వైష్ణవ్ తేజ్ (సాయి ధరమ్ తేజ్ తమ్ముడు), రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాని తీసున్నాడు క్రిష్.

రకుల్ తన ఇన్ స్టాగ్రామ్ నిండా యోగా ఆసనాలు, హెల్తీ డైట్ విశేషాలతో నింపుతుంటుంది. ఆమె డ్రగ్స్ తీసుకుంటుందా అంటే నమ్మశక్యంగా లేదు బట్ హాలీవుడ్ నుంచి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, సాండల్వూడ్, మాలీవుడ్ అన్ని చోట్లా పార్టీల్లో డ్రగ్స్ తీసుకోవడం ఉంది అనే మాట వినిపిస్తూనే ఉంది.

Related Stories