ఇంకో హిట్ కొట్టాలనే తపన

Rashmika

ఛలో, దేవదాస్, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప… ఇవి ఇప్పటివరకు రష్మిక నటించిన తెలుగు చిత్రాలు. నాలుగేళ్లలో ఆమె ఏడు చిత్రాలే తెలుగులో చేసింది. ఇందులో ‘డియర్ కామ్రేడ్’ ఒక్కటే ఘోరమైన ఫ్లాప్. మిగతావన్నీ హిట్స్ లేదా యావరేజ్ చిత్రాలు. అంటే ఆమెకి సక్సెస్ రేట్ సూపర్ గా ఉంది. ఆల్మోస్ట్ 90 శాతం విజయాలే.

Advertisement

అందుకే, రష్మికకి అంత క్రేజ్. ఇప్పుడు ‘పుష్ప’ విజయంతో జాతీయస్థాయికి పాకింది. ఐతే, ఆమె హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఆమె తదుపరి చిత్రం… ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శర్వానంద్ హీరో. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 25న థియేటర్లలోకి వస్తుంది ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమాని హిట్ చేస్తే శర్వానంద్ కి కూడా హిట్ ఇచ్చిన పేరు ఆమెకి వస్తుంది.

రీసెంట్ గా శర్వానంద్ అన్ని అపజయాలు చూస్తున్నాడు. ఆఖరికి సమంత సరసన నటించినా (జాను) విజయం దక్కలేదు. మరి రష్మిక అలా చేస్తే ఆమెకి స్టార్ డమ్ మరింతగా పెరుగుతుంది.

ఇక ఈ సినిమా ప్రొమోషన్ తో బిజీ కానుంది రష్మిక.

Advertisement
 

More

Related Stories