
‘బింబిసార’ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా తీసిన దర్శకుడికి, నిర్మించి, నటించిన కళ్యాణ్ రామ్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఐతే, ఈ విజయంలో కరివేపాకులా మిగిలిన వాళ్ళు హీరోయిన్లు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు – క్యాథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్. వీరి పాత్రలు నామమాత్రం.
ముఖ్యంగా సంయుక్త మీనన్ ఈ సినిమాలో ఎందుకుందో, ఆమె పాత్ర ఎంటో ఎవ్వరికీ అర్థం కాదు. ఐతే, ఇప్పుడు సినిమా హిట్ అయింది, రెండో పార్టు గురించి ఆలోచన మొదలైంది కాబట్టి ఈ భామ చాలా ఆశలు పెట్టుకొంది. రెండో భాగంలో తన పాత్రకి వ్యాల్యూ ఉంటుంది అని భావిస్తోంది. కానీ, రెండో భాగంలో ఈమెకి ఛాన్స్ ఉంటుందా?
సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’లో నటించింది. అందులో కూడా ఆమెది చిన్న పాత్రే. రానాకి భార్యగా నటించింది. ఇక రెండో తెలుగు చిత్రం ‘బింబిసార’లో కళ్ళు మూస్తే మాయమయ్యే పాత్ర.
త్వరలోనే ధనుష్ సరసన మెరవనుంది. ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోన్న ‘సార్’ చిత్రంలో సంయుక్త మీనన్ మెయిన్ హీరోయిన్. ఈ సినిమాలో అయినా ఆమెకి ఒక హీరోయిన్ కి దక్కాల్సిన ఒక రెండు పాటలు, చెప్పుకోదగ్గ సన్నివేశాలు దక్కుతాయా అనేది చూడాలి.
సంయుక్త, సంయుక్త మీనన్, బింబిసార, కళ్యాణ్ రామ్,