సందీప్ కి ఈసారైనా హిట్టొచ్చేనా?

Ooru Peru Bhairavakona

హీరో సందీప్ కిషన్ చాలా కాలంగా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు కానీ విజయం వరించడం లేదు. “ఈసారి గ్యారెంటీ హిట్ అని” సందీప్ కిషన్ అనుకున్న ప్రతిసారీ ఎదో ఒక కారణంగా వర్కవుట్ కావడం లేదు.

తాజాగా “ఊరు పేరు భైరవకోన” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఐతే ఈ సినిమాతో అయినా హిట్ వస్తుందా అన్నది అందరిలో కలుగుతున్న ప్రశ్న.

ట్రైలర్ బాగున్న మాట వాస్తవమే. “కాంతార” “విరూపాక్ష” “హనుమాన్” వంటి సినిమాల సక్సెస్ చూసిన తర్వాత “ఊరు పేరు భైరవకోన”పై అంచనాలు కలుగుతున్నాయి. సినిమా బాగుంది అన్న టాక్ రావాలి. అలా వస్తే సందీప్ కిషన్ కోరుకుంటున్న “బ్లాక్ బస్టర్” దక్కుతుంది. కాకపోతే, ఈ సినిమా మరో రెండు సినిమాలతో పోటీ పడాలి.

మరి, రెండు సినిమాలతో పోటీ పడి మరీ హిట్ అందుకునేంత సత్తా ఈ సినిమాకి ఉందా? ఆ అదృష్టం సందీప్ కిషన్ కి ఉందా?

Advertisement
 

More

Related Stories