సత్యదేవ్ కి ఇదైనా కలిసొచ్చేనా!

Satyadev


యువ హీరో సత్యదేవ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. పెద్ద హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు. బాలీవుడు ప్రేక్షకులకు ఈ సినిమా కన్నా ముందే ‘గాడ్ ఫాదర్’తో పరిచయం అయ్యాడు. అందులో విలన్ గా నటించాడు.

ఐతే, చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటించిన ‘గాడ్ ఫాదర్’ హిందీలో ఆడలేదు. సో, ‘రామ్ సేతు’ అధికారికంగా హిందీ డెబ్యూ అవుతుంది. మరి సత్యదేవ్ కి ఈ సినిమా అయినా కలిసొస్తుందా అనేది చూడాలి.

ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన సినిమాలేవీ థియేటర్లలో ఆడడం లేదు. కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. ఐతే, ఇది ‘హిందూయిజం’ కథావస్తువుగా ఉన్న చిత్రం. హిందూమతం, హిందుమత ఆచారాలు, పురాణాలతో కూడిన చిత్రాలకు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి డిమాండ్ ఉంది. అలాంటివి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే, ‘రామ్ సేతు’ చిత్రాన్ని ఈ దీపావళి కానుకగా రేపు విడుదల చేస్తున్నారు.

‘రామ్ సేతు’తో సత్యదేవ్ కి బాలీవుడ్ లో గుర్తింపు, అక్షయ్ కుమార్ కి విజయం దక్కుతుందా అనేది చూడాలి.

 

More

Related Stories