ఒంపుసొంపుల షోతో ఆఫర్లు పెరిగేనా?

- Advertisement -
Shivani

హీరోయిన్ గా ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది శివాని. రాజశేఖర్, జీవితల పెద్ద కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివానికి ఇంకా రావాల్సిన బ్రేక్ రాలేదు.

ఇటీవల ఈ భామ “కోటబొమ్మాళి పీఎస్” అనే సినిమాలో నటించింది. అందులో గ్లామర్ కి ఏ మాత్రం అవకాశం లేని పాత్ర. నటనతోనే మెప్పించాల్సిన ఆ పాత్రలో శివాని మంచి మార్కులు పొందింది. ఐతే, హీరోయిన్ గా సక్సెస్ రావాలంటే గ్లామర్ పాత్రలు చెయ్యాలి. బహుశా ఆ వైపు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

ఇటీవల ఈ భామ ఎక్కువగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలాంటి గ్లామర్ సోయగాలతో కూడిన షో చేస్తూ కుర్రకారుకు కనువిందు కలిగిస్తోంది. తాజాగా ఆమె చీరకట్టు అందాలను చూపించింది.

ALSO CHECK: Shivani Rajasekhar’s Saree Sizzle Pics

శివాని ఇప్పటివరకు “పెళ్లి సందD”, “అద్భుతం”, “www”, “శేఖర్, “కోటబొమ్మాళి” అనే ఐదు తెలుగు చిత్రాల్లో నటించింది. మరో రెండు తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించింది. తాజాగా ఒక తమిళ మూవీ చేస్తోంది. అంటే మొత్తంగా ఇప్పటికే ఎనిమిది సినిమాలు. అయినా ఇంకా ఆమెకి సరైన బ్రేక్ రాలేదు.

Shivani

ఐతే, తన చెల్లెలు శివాత్మికతో పోల్చితే శివాని కొంచెం ఎక్కువ ఆఫర్లే రాబట్టుకొంది.

 

More

Related Stories