
సంక్రాంతికి విడుదలవుతున్న రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్ శృతి హాసనే. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్యకి మాస్ పెళ్ళాంగా, ‘వాల్తేర్ వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవికి శ్రేదేవిగా నటించింది శృతి హాసన్. ఐతే, ఆమె రెండు సినిమాల్లో ఒక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మాత్రమే అటెండ్ అయింది. ఇంకో దానికి డుమ్మా కొట్టింది. దానికి కారణం కూడా ఉంది.
ఒంగోలులో నిర్వహించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈవెంట్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమెకి జలుబు చేసింది, జ్వరం వచ్చింది. కోవిడ్ అన్న అనుమానంతో ఇంటిపట్టునే ఉంది. ఆమె ఇంకా కోలుకోలేదు. అందుకే, ఆదివారం వైజాగ్ లో జరిగిన ‘వాల్తేర్ వీరయ్య’ ఈవెంట్ కి వెళ్ళలేదు. ఇది కారణం.
ఐతే, చిరంజీవి అభిమానులు మాత్రం ఆమెని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. “హెల్త్ కారణంగా ఈవెంట్ కి హాజరు కాలేదు సరే కానీ సినిమాకి పబ్లిసిటీ చేస్తావా లేదా,” అంటూ ఆమెని అడుగుతున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లలో పాల్గొంటాను అని ఆమె టీంకి ప్రామిస్ చేసింది.