ఇంతకీ కార్తికేయ, సుక్కు మూవీ ఉంటుందా?

Kartikeya

కార్తికేయ హీరోగా సుకుమార్ రైటింగ్స్ తో సినిమా ఉంటుంది అని ఆ మధ్య ప్రకటించారు. ‘చావు కబురు చల్లగా’ సినిమా విడుదలకు ముందు హడావిడి జరిగింది. ఆ సినిమా ఢమాల్ అనిపించుకుంది. మరి, సుకుమార్ కార్తికేయతో నిజంగా సినిమా నిర్మిస్తాడు? లేక… అదంతా ఆ సినిమాకి హైప్ తెచ్చేందుకు చేసిన హంగామా అనుకోవాలా

సుకుమార్ తన శిష్యులని దర్శకులుగా పరిచయం చేస్తూ, తన డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాస్తున్నట్లు చెపుతూ … సినిమా నిర్మాణాలు చేస్తున్నారు. ‘ఉప్పెన’, ‘కుమారి 21 ఎఫ్’ వంటివి అలా సక్సెస్ అయ్యాయి. కానీ కార్తికేయతో మూవీ నిర్మిస్తాడా అన్నది చూడాలి.

More

Related Stories