తరుణ్ భాస్కర్ సత్తా చూపుతాడా?

Keedaa Cola

తరుణ్ భాస్కర్ దాస్యం తీసిన “పెళ్లిచూపులు” తెలుగులో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. కానీ తరుణ్ భాస్కర్ దర్శకత్వం పక్కన పెట్టి యాక్టింగ్, ఇతర వ్యాపకాలతో బిజీ అయిపోయారు. “పెళ్లి చూపులు” తర్వాత “ఈ నగరానికి ఏమైంది” మాత్రమే తీశారు.

ఇప్పుడు మూడో సినిమా పూర్తి చేశారు. ‘కీడా కోలా’ పేరుతో రూపొందిన ఈ క్రైం కామెడీ చిత్రంలో తరుణ్ హీరోగా కూడా నటించారు. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. నవంబర్ 3న ‘కీడా కోలా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బ్రహ్మానందం ఒక కీలక పాత్ర పోషించడం విశేషం.

మరి తరుణ్ భాస్కర్ మళ్లీ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతారా? మొదటి సినిమాలో చూపించిన ‘ఫ్రెష్ నెస్’ ఇందులోకి తెచ్చారా? ఒక విధంగా చెప్పాలంటే తరుణ్ భాస్కర్ తీసిన ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని జనం మర్చిపోయారు. ఐతే ఆయనకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అంటున్నారు. ఉందా లేక యూత్ కూడా మర్చిపోయారా అనేది నవంబర్ 3న తేలుతుంది.

Advertisement
 

More

Related Stories