సంక్రాంతికి కూడా డౌటే!

'Most Eligible Bachelor' movie still

వచ్చే నెలలో థియేటర్లు ఓపెన్ అయ్యేలా కనిపిస్తోంది. కరోనా వల్ల థియేటర్లకు, సినిమా పరిశ్రమకి జరిగిన నష్టం గురించి చిత్రపరిశ్రమ పెద్దలు ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిశారు. ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఐతే, థియేటర్లు తెరుచుకున్నా… ఇదే పరిస్థితి కొనసాగితే సంక్రాంతికి కూడా పెద్దగా బిజినెస్ ఉండకపోవచ్చు.

ఒకటి కాదు, రెండు కాదు.. సంక్రాంతికి దాదాపు అరడజను సినిమాలు వస్తున్నట్టు ప్రకటనలు చూశాం. వీటిలో కొన్ని డ్రాప్ అయినా కనీసం నాలుగైనా సంక్రాంతికి రావడం ఖాయం. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇవి కూడా డైలమాలో పడ్డాయి.

ఇప్పటికే ”వకీల్ సాబ్”, ”ఆచార్య” సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. ”రంగ్ దే”, ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాలపై పునఃసమీక్షలు మొదలయ్యాయి. ఫస్ట్ కాపీ రెడీ చేసిన తర్వాత సంక్రాంతికి రావాలా, నేరుగా ఓటీటీకి వెళ్లాలా అనేది నిర్ణయించుకుంటారు.

వీటన్నింటికంటే ముందే ”సోలో బ్రతుకే సో బెటర్” సినిమా థియేటర్లోకి వచ్చేలా ఉంది. డిసెంబర్ మూడో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. థియేటర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోతే ఈ సినిమా కూడా ఓటీటీ బాట పట్టేలా ఉంది. అటు ”క్రాక్”, ”రెడ్” సినిమా నిర్మాతలు మాత్రం సంక్రాంతి కాకపోతే సమ్మర్.. అన్నట్టు ధీమాగా ఉన్నారు.

Related Stories