హిందీలో ఓపెనింగ్ వస్తుందా?

Operation Valentine

వరుణ్ తేజ్ కూడా హిందీ మార్కెట్ పై కన్నేశాడు. ఇటీవల పలువురు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ కావాలని సినిమాలు చేస్తున్నారు. అందులో విజయం అందుకున్నది కొందరే. “హనుమాన్”, “కార్తికేయ 2” వంటి సినిమాలు కూడా హిందీలో ఆడినా ఆ సినిమాల్లో నటించిన హీరోలకు సొంతంగా హిందీ మార్కెట్ లో క్రేజ్ దక్కిందా అనేది అనుమానమే.

ఐతే, ఇప్పుడు వరుణ్ తేజ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం “ఆపరేషన్ వాలెంటైన్” చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల అవుతోంది. మార్చి 1న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. “ఆపరేషన్ వాలెంటైన్” చిత్రాన్ని సోని పిక్చర్స్ సంస్థ నిర్మించింది. అది అంతర్జాతీయ సంస్థ. అందుకే ఈ సినిమాని ఆ సంస్థ హిందీలో ఎక్కువగా పబ్లిసిటీ చేస్తోంది.

వరుణ్ తేజ్ కూడా హిందీ మీడియాకి ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు. హిందీ టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సినిమాకి చెయ్యాల్సినంత ప్రమోషన్ చేశాడు. ఇక ఇప్పుడు సినిమాకి ఎలాంటి ఓపెనింగ్ వస్తుంది అనేది చూడాలి.

మెగా ఫ్యామిలీలో పాన్ ఇండియా హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేరు తెచ్చుకున్నారు. మరి ఆ లిస్ట్ లోకి వరుణ్ తేజ్ చేరుతాడా అన్నది చూడాలి.

Advertisement
 

More

Related Stories