మారుతి పరిస్థితి ఎంటిప్పుడు?

Maruthi

“ప్రతిరోజు పండుగే” లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో విడుదల అయింది. సినిమా సూపర్ హిట్. కానీ, ఏడాది అయిపోయిన తర్వాత కూడా తన నెక్స్ట్ సినిమా ఫలానా హీరోతో అని బహిరంగంగా ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నాడు మారుతి.

మారుతికి హీరోల డేట్స్ దొరకడం లేదు అందుకే అతని నెక్స్ట్ సినిమా డిలే కానుందని గతంలోనే తెలుగుసినిమా.కామ్ రాసింది. అప్పుడు మారుతి టీం … అది తప్పు అని… హీరో రెడీ, నిర్మాత రెడీ , ప్రకటించడమే లేట్ అని చెప్పింది. ఇప్పుడు, రవితేజ మా సినిమా చెయ్యనంటున్నాడు, రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి మా నిర్మాత రిజెక్ట్ చేశాడు అని మారుతీ టీం “రాయించుకుంటోంది”.

ఇప్పుడే అదే కథ వేరే హీరోతో చేస్తామని చెప్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో? ఆ ‘వేరే హీరో’ రెడీగా ఉంటే సినిమా ప్రకటించడానికి ఎందుకు లేట్ చేస్తున్నారో?

మొత్తానికి మారుతి హిట్ కొట్టినా ఏడాది పైనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది అనేది నిజం.

More

Related Stories