ఇది నిజమైతే.. బాడ్ ఛాయస్!

chiranjeevi long

మలయాళంలో “లూసిఫర్” సినిమా ఒక సూపర్ డూపర్ బ్లాక్బాస్టర్. మోహన్ లాల్ ఇమేజ్ కి 100 % సూట్ అయింది. ఆ సినిమాలో మోహన్ లాల్ కి హీరోయిన్ లేదు. డ్యూయెట్ లు లేవు, రొమాన్స్ కి స్కోప్ లేదు. మరి ఇలాంటి సినిమాని తెలుగులో చిరంజీవి చేస్తున్నారు. తెలుగులో అవన్నీ యాడ్ చెయ్యబోతున్నారు

“సాహో” దర్శకుడు సుజిత్ డైరక్ట్ చెయ్యబొయ్యే ఈ మూవీ వచ్చే ఏడాది మొదలు అవ్వొచ్చు. ఐతే, ఈ లోపే ఈ సినిమాలో ఫలానా హీరోయిన్ ఉంటుంది, ఫలానా నటుడు నటించబోతున్నట్లు అభిమానులు ప్రచారం చేస్తున్నారు. అందులో నిజమెంతో చూడాలి. ఈ మొత్తం ప్రచారంలో ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే… సుహాసినిని చిరంజీవి సోదరి పాత్రకి అడిగారు అనేది.

ఇది నిజమైతే మాత్రం… వరస్ట్ కాస్టింగ్ ఛాయస్ అని చెప్పాలి.

Suhasini and Manju Warrier

మలయాళంలో ఆ పాత్రని మంజు వారియర్ పోషించారు. మంజు వారియర్ ఒక టీనేజ్ కూతురుకి తల్లిగా ఆక్ట్ చేశారందులో. ఆ పాత్రకి 40,50కి చేరువలో ఉన్న నటి పర్ఫెక్ట్. 60కి చేరువలో ఉన్న సుహాసిని ఈ పాత్రకి అస్సలు సూట్ కాదు. ఈ సినిమాలో మంజు వారియర్ భర్త (వివేక్ ఒబెరాయ్) పాత్ర కీలకం. మంజుని వివేక్ రెండో మ్యారేజ్ చేసుకున్నాడు అంటే బిలీవబుల్ ఫాక్టర్ ఉంది. సుహాసిని ఐతే అది ఉండదు.

ఇది కేవలం రూమర్ కావాలని కోరుకుందాం. “సాహో” సినిమాకి చేసిన తప్పులే మళ్ళీ “లూసిఫర్” రీమేక్ కి దర్శకుడు సుజీత్ చేయదనే నమ్ముదాం.

Related Stories