భార్యతో యష్ బర్త్ డే సంబరం

నేడు రాఖీ భాయ్ 35వ బర్త్ డే. కన్నడ స్టార్ యష్ ఇప్పుడు దేశమంతా పాపులర్ అయ్యాడు “కేజీఎఫ్” సక్సెస్ తో. ఈ పుట్టిన రోజుకు “KGF2” టీజర్ వచ్చింది. ఐతే, కోవిడ్ 19 కారణంగా 35వ బర్త్ డేని సింపుల్ గా జరుపుకున్నాడు. భార్య రాధికా పండిట్ తో కలిసి కేక్ కట్ చేశాడు. ఆ ఫోటోని ఈ జంట షేర్ చేసింది.

యష్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాలని అతని టీం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అతని ఇమేజ్ పెరిగేలా సోషల్ మీడియాలో ట్రేండింగ్ కి అనుకూలంగా ఫోటోలు, సంబరాలు ఉండేలా చూస్తున్నారు.

“కేజీఎఫ్ 2” తర్వాత అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్లోనే ఉండేలా చూసుకుంటాడట. అంటే కన్నడ సినిమా ఇండస్ట్రీకి ప్రభాస్ లా యాష్ మారుతున్నాడు.

More

Related Stories