యష్ తో లోకేష్


“కేజీఎఫ్” చిత్రాలతో దేశవ్యాప్తంగా పాప్ లర్ అయ్యారు కన్నడ హీరో యష్. అతని తదుపరి చిత్రం ఏంటనే విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. యష్ మాత్రం కొత్త సినిమాని కొత్త ఏడాదిలో మొదలు పెడదామని భావిస్తున్నాడు. అందుకే ప్రస్తుతం రిలాక్స్డ్ గా ఉన్నాడు.

ఇక తాజాగా యష్ నారా లోకేష్ ని కలవడం అందర్నీ ఆకర్శించింది. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి లోకేష్ తో యష్ ముచ్చటించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గురువారం బెంగుళూరు వెళ్లిన లోకేష్ ఓ హోటల్ లో దిగారు. అదే హోటల్ కి భోజనానికి వచ్చిన యష్ ని చూసి పలకరించారట లోకేష్. వీరిద్దరూ దాదాపు అరగంట సేపు ముచ్చటించినట్లు సమాచారం.

యష్ కి ఇప్పటికే విపరీతమైన క్రేజ్, మార్కెట్ దక్కింది తెలుగునాట. ఇంకా పెరిగే అవకాశం ఉంది. లోకేష్, యష్ ఫోటోలు వైరల్ కావడం రాజకీయంగా చాలా ఊహాగానాలకు ఊతమిచ్చింది. దాంతో, సాయంత్రానికి యష్ టీం క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం మర్యాదపూర్వక కలయిక తప్ప మరోటి కాదు అని చెప్పింది ఆయన టీం.

 

More

Related Stories