
కన్నడ హీరో యశ్ కి కర్ణాటకలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అతనే. “కేజీఎఫ్” సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న యశ్ అభిమానులు ఇటీవల మృతి చెందారు.
ఆయన పుట్టిన రోజునాడు ఫ్లెక్సీలు కట్టే ప్రయత్నంలో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులను యశ్ పరామర్శించారు. ఆ కుటుంబాల బాధని చూసి చలించిపోయారు.
“నేను పుట్టిన రోజు సంబరాలకు దూరంగా ఉంటున్నది ఇందుకే. నా ప్రతి పుట్టిన రోజుకి ఈ భయం వెంటాడుతుంది. అభిమానులు నాపై ఇలాంటి అభిమానం చూపొద్దు. మీ తల్లితండ్రులకు క్షోభ కలిగించే అభిమానం నాకు వద్దు,” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు యశ్.
మరోవైపు, యశ్ ఇటీవలే “టాక్సిక్” అనే కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమాలో యశ్ సరసన కరీనా కపూర్ ని తీసుకోవాలని భావిస్తున్నారట. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.